Job Update Posted on May 10, 2026, 9:23 am

Stree Nidhi, Telnagana | తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్‌లో 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

Stree Nidhi, Telnagana | తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్‌లో 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవల్‌లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది తెలంగాణ ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల (SHG) సమాఖ్యలచే ఉమ్మడిగా ప్రోత్సహించిన సంస్థగా స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వ్యవహరిస్తుంది.

ఇది తెలంగాణ ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తుంది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు మే 29 వరకు అప్లై చేసుకోవాలి.
స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవలపోస్టు వివరాలు: ఖాళీలు
* అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ ఆపరేషన్స్): మొత్తం 123 ఖాళీలు.
(ఓసీ: 60, ఈడబ్ల్యూఎస్‌: 03, బీసీ-ఏ:16, బీసీ-బి: 02, ఓహెచ్‌: 09, ఎస్సీ (గ్రూప్‌1):04, ఎస్సీ(గ్రూప్‌2): 26, ఎస్టీ: 03)
అర్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 65% మార్కులతో (ఓసీలకు), 60% (బీసీలకు), 55% (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు) బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు మొత్తం సుమారు రూ.33,960. ప్రయాణ అలవెన్స్, పనితీరు ఆధారిత వేరియబుల్ పే వంటివి కలిసి ఉంటాయి.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 మార్కులు), రీజనింగ్(25 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), బ్యాంకింగ్‌తో కూడిన జనరల్ అవేర్‌నెస్(25 మార్కులు) అంశాలపై 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత (Penalty) ఉంటుంది. ఎగ్జామ్‌ వ్యవధి: 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు స్త్రీ నిధి వెబ్‌సైట్ (www.streenidhi.telangana.gov.in) ద్వారా కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.770, ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ.885.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 29.05.2026 (రాత్రి 12:00 గంటల వరకు).
పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్.

ముఖాంశాలు
* ఇది ప్రభుత్వ ఉద్యోగం లేదా శాశ్వత ఉద్యోగం కాదు; పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
* అభ్యర్థులు తమ సొంత జిల్లాలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
* నెలలో కనీసం 20 రోజులు ఫీల్డ్ టూర్ చేయాల్సి ఉంటుంది.
* ప్రతి జిల్లాలో 10% పోస్టులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు కేటాయించారు.

Stree Nidhi Telangana 2026 Assistant Manager Notification

Interested in this update?
Apply / View Link
Share this:
Ambati Net World

Your trusted destination for the latest job updates, career opportunities, and government schemes.