Job Update Posted on April 27, 2026, 3:34 am

SSC | ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2026 - 731

SSC | ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ 2026 - 731
గ్రేడ్ ‘సి, ‘గ్రేడ్‌ ‘డి’ ఖాళీలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ జాతీయ స్థాయి పరీక్ష భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ మే 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.


వివరాలు:
* స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి (గ్రూప్‌ బి, నాన్‌ గేజిటెడ్‌)
* స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి (గ్రూప్‌ సి) ఎగ్జామినేషన్‌, 2026
మొత్తం ఖాళీల సంఖ్య: 731.

అర్హతలు: అభ్యర్థులు 01-08-2026 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులకు ఖచ్చితంగా స్టెనోగ్రఫీ (Stenography) లో నైపుణ్యం ఉండాలి.

వయోపరిమితి: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ కు18 నుంచి 30 సంవత్సరాలు (02-08-1996 నుంచి 01-08-2008 మధ్య జన్మించి ఉండాలి).

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'డి' 18 నుంచి 27 సంవత్సరాలు (02-08-1999 నుంచి 01-08-2008 మధ్య జన్మించి ఉండాలి).
* ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్- 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్- 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్- 100 మార్కులు మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్ష వ్యవధి: 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్: రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి హిందీ లేదా ఇంగ్లిష్‌లో (అభ్యర్థి ఎంచుకున్న దాని ప్రకారం) స్టెనోగ్రఫీ పరీక్ష ఉంటుంది. గ్రేడ్ 'C' కు నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ 'D' కు 80 పదాల వేగం ఉండాలి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: తుది ఎంపికకు ముందు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-04-2026.
దరఖాస్తు చివరి తేదీ: 15-05-2026.

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 16-05-2026.
దరఖాస్తు సవరణకు తేదీలు: 20-05-2026 - 21-05-2026
ఆన్‌లైన్‌ ఆధారిత పరీక్ష తేదీలు: జులై - ఆగస్టు 2026.

Stenographer Grade ‘C’ & ‘D’ Examination, 2026
Interested in this update?
Apply / View Link
Share this:
Ambati Net World

Your trusted destination for the latest job updates, career opportunities, and government schemes.