సర్కార్ బడులు మరింత బలోపేతం చేయడానికి రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల సేవలు వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జూన్లో పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో నూతన సర్పంచ్లకు ఒక రోజు వర్క్షాప్ నిర్వహించనున్నది. జిల్లాస్థాయిలో నిర్వహించే ఈ వర్క్ షాప్ను డీఈవోలు ఏర్పాట్లు చేయా లని విద్యాశాఖ ఆదేశించింది. పాఠ శాల విద్యాశాఖ కార్యక్రమాలు, సాధిం చిన విజయాలు, అమ్మ ఆదర్శ పాఠ శాలల పనితీరు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, మౌలిక వసతులు, ప్రీ ప్రైమరీ, బ్రేక్ఫాస్ట్, ఎన్రోల్మెంట్, బడిబాట కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నది..