Admin Login
Language:
For Students

Student Services & Updates

తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మరియు ఇతర నోటిఫికేషన్లు - 2026

1️⃣ TG DEECET
🔸 పరీక్ష తేదీలు: మే 21, 22
📌Hallticket Download link
https://deecet.cdse.telangana.gov.in/



3️⃣ TG LAWCET (3 Years)
🔸 అర్హత: ఏదైనా డిగ్రీ
🔸 పరీక్ష తేదీ: మే 18
📌Hallticket Download link:https://lawcet.tgche.ac.in/

4️⃣
TG LAWCET (5 Years)
🔸 అర్హత: ఇంటర్
🔸 దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 1
🔸 పరీక్ష తేదీ: మే 18
📌 Download Hall Ticket :
https://lawcet.tgche.ac.in/
May 16, 2026

CBSE కీలక నిర్ణయం

9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసిన CBSE.

జూలై 2026 నుంచి త్రిభాషా విధానం అమలు.
CBSE అనుబంధ స్కూళ్లంన్నింటికీ సర్క్యూలర్‌ జారీ.
చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని స్పష్టం.
మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశం కల్పించిన CBSE.
విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా CBSE నిర్ణయం.
May 16, 2026

ఉచిత విద్య, వసతితో పాటు సీబీఎస్‌ఈ (CBSE) ఫలితాల్లో 'శ్రీ శారదా నికేతన్' ప్రభంజనం!

మార్టూరు (బాపట్ల జిల్లా): సమాజంలో వెనుకబడిన, ఆదరణకు నోచుకోని విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ధ్యేయంగా బాపట్ల జిల్లా మార్టూరులోని శ్రీ శారదా నికేతన్ పబ్లిక్ స్కూల్ & జూనియర్ కాలేజ్’ సరికొత్త అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. పోలినేని చిన్నమ్మయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, డాక్టర్ పోలినేని సుబ్బారావు గారి సారథ్యంలో నడుస్తున్న ఈ సంస్థ, పూర్తిగా సేవాభావంతో విద్యార్థులందరికీ *ఉచిత విద్య, ఉచిత భోజనం మరియు ఉచిత హాస్టల్ వసతిని (బాలురకు, బాలికలకు విడివిడిగా) కల్పిస్తోంది.
ఇక్కడ 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం (CBSE) లో బోధన అందిస్తున్నారు.

అర్హులైన వారికే ప్రవేశాలు:
ఈ పాఠశాలలో ప్రవేశాలు కేవలం సమాజంలో అత్యంత వెనుకబడిన మరియు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.
అనాథలు, వీధిబాలలు, తల్లి లేదా తండ్రి లేని పిల్లలు.
ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కుటుంబాల పిల్లలు.
హెచ్.ఐ.వి (HIV) తో బాధపడుతున్న లేదా బాధితులైన పిల్లలు.

గమనిక: అనాథ పిల్లల కోసం ఈ పాఠశాలలో ఎల్లప్పుడూ (ఏ సమయంలోనైనా) ప్రవేశం కల్పించబడుతుంది.

ఫలితాల్లో అద్భుత ప్రగతి – పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్:
కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా, చదువులోనూ ఈ సంస్థ అగ్రగామిగా నిలిచింది. సిబిఎస్‌ఇ (CBSE OASIS 5.0) అధికారిక లెక్కల ప్రకారం:

10వ తరగతి ఫలితాలు: గత వరుసగా 5 సంవత్సరాలుగా (2019 నుండి 2023 వరకు) ఈ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది.
ఇంటర్మీడియట్ ఫలితాలు:
2022లో 100%, 2023లో 93.33% ఉత్తీర్ణతతో విద్యార్థులు ఘన విజయం సాధించారు.
ప్రత్యేక కోచింగ్ వివరాలు:
ఉన్నత చదువుల కోసం విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఇక్కడ *NEET, JEE Mains మరియు CPT (CA) కోర్సులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. ప్రత్యేక ఎగ్జామినేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా వారానికి రెండు సార్లు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను మెరుగుపరుస్తున్నారు. ఇక్కడ గ్రూపుల విభాగంలో MPC, BiPC కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేకతలు మరియు వసతులు:
పరిమిత సంఖ్యలో విద్యార్థులు: ప్రతి సెక్షన్‌కు కేవలం 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించి, ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తారు.
హెల్పింగ్ అవర్స్ & ప్రత్యేక తరగతులు: చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రత్యేక ఇంగ్లీష్ (HSNC, MSNC, LSNC) తరగతులు నిర్వహిస్తారు.
ఆధునిక వసతులు: విశాలమైన కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్ మరియు LED TV లతో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్ కలవు.
స్వచ్ఛంద సేవ – ఉన్నత చదువులకు సహాయం:
ఈ విద్యాసంస్థ అమెరికా గవర్నమెంట్ నుండి కానీ, ఇండియా గవర్నమెంట్ నుండి కానీ లేదా ఎలాంటి మతపరమైన, రాజకీయ సంస్థల నుండి ఎటువంటి ఆర్థిక లేదా ఆర్థికేతర వనరులు (సహాయం) సేకరించకుండా కేవలం స్వచ్ఛందంగా నడపబడుతోంది.
అంతేకాకుండా, ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల పైచదువుల ఖర్చులను కూడా డా|| పోలినేని సుబ్బారావు గారే స్వయంగా భరిస్తూ వారిని చదివిస్తున్నారు.
అడ్మిషన్లు మరియు ఇతర వివరాల కొరకు సంప్రదించాల్సిన నెంబర్లు:
మీకు తెలిసిన అనాథ లేదా పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారాన్ని అందించి కింద పేర్కొన్న నెంబర్లలో సంప్రదించగలరు:
ఫోన్ నెంబర్లు: 85001 44199, 96181 71803
*చిరునామా / రూట్ మ్యాప్: శ్రీ శారదా నికేతన్ పబ్లిక్ స్కూల్, మార్టూరు, బాపట్ల జిల్లా.
(చిలకలూరిపేట నుండి 11 కి.మీ, మార్టూరు సెంటర్ నుండి 1.5 కి.మీ దూరం – చిలకలూరిపేట నుండి ఒంగోలు వెళ్లే రహదారిలో హెచ్.పి. పెట్రోల్ బంక్ సమీపంలో ఈ సంస్థ కలదు).
May 16, 2026

ఏఎన్‌ఎం పరీక్ష ఫలితాల విడుదల

ఏఎన్‌ఎం (మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజినల్‌ జాబితాను విడుదల చేసినట్లు గురువారం మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోస్టులకు 24,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 20,600 మంది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌కు (సీబీటీ) హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ సర్వీస్‌ వెయిటేజీని 30 నుంచి 20 మార్కులకు పరిమితం చేశారు. అభ్యర్థుల సీబీటీ మార్కులు, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ సేవలకు సంబంధించిన వెయిటేజీ మార్కులతో కూడిన ప్రొవిజినల్‌ జాబితాను గురువారం విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే మే 18 నుంచి 22 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యంతరాలు ఒక్కసారి మాత్రమే నమోదు చేసే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మొత్తంగా హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1,666 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 265 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది.
May 15, 2026

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌.. తగ్గిన ఉత్తీర్ణత శాతం

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్‌ 10 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. విద్యార్థులు తమ రిజల్ట్స్‌ (CBSE class 12 Results)ను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్లు cbse.gov.in, cbseresults.nic.in, డిజీలాకర్, ఉమాంగ్‌ యాప్‌ల నుంచి తెలుసుకోవచ్చు.

🌀దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రాశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3శాతం తగ్గడం గమనార్హం. బాలికల్లో 88శాతం, అబ్బాయిల్లో 82శాతం మంది పాస్‌ అయ్యారు. 17వేల మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్‌ చేశారు. 94వేల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా సీబీఎస్‌ఈ 12 ఫలితాలను మే 13వ తేదీనే విడుదల చేయడం గమనార్హం.

💠గతంలో సీబీఎస్‌ 10, 12వ తరగతుల పరీక్షల ఫలితాలను ఏకకాలంలో విడుదల చేసేవారు. కానీ, ఈసారి పదోతరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించడంతో గత నెలలోనే టెన్త్‌ ఫలితాలను ప్రకటించారు. తాజాగా 12వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి సమాధాన పత్రాలను 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' (OSM) పద్ధతిలో డిజిటల్‌గా మూల్యాంకనం చేశారు. దీనికోసం ఉపాధ్యాయులకు ముందస్తుగా శిక్షణ కూడా ఇచ్చారు.
May 14, 2026

GK Bits in Telugu Part-1 PDF

PDF Document

May 12, 2026

GK Questions and Answers

Question 01

భారతదేశ జాతీయ పండు ఏమిటి ?

Answer : మామిడి పండు


Question 02

ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసినారు ?

Answer : 73వ రాజ్యాంగ సవరణ


Question 03

సాధారణంగా సోడియం క్లోరైడ్‌ను ఏమని పిలుస్తారు ?

Answer : వాషింగ్‌ సోడా


Question 04

టెలిఫోన్‌ను ఎవరు కనుగొన్నారు ?

Answer : అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌


Question 05

మొట్టమొదటి సారిగా ఏషియా గేమ్స్‌ను ఏ దేశం నిర్వహించింది ?

Answer : భారతదేశం


Question 06

అజంతా గుహలను ఎవరి కాలంలో నిర్మించారు ?

Answer : గుప్తా


Question 07

ప్రాన్స్‌ దేశం రాజధాని ఏది ?

Answer : ప్యారిస్‌


Question 08

సూర్య కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది ?

Answer : జూపిటర్‌


Question 09

ప్రఖ్యాతి చెందిన ‘ది మోనాలిసా’ చిత్రాన్ని లిఖించింది ఎవరు ?

Answer : లియోనార్డో డావిన్సీ


Question 10

ప్రపంచంలో అతిఎత్తయిన శిఖరం ఏది ?

Answer : మౌంట్‌ ఎవరెస్టు


Question 11

ప్రస్తుతం (2023) అమెరికా అధ్యక్షుడు ఎవరు ?

Answer : జోబిడెన్‌


Question 12

‘పెన్సిలిన్‌’ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?

Answer : అలెగ్జాండర్‌ ప్లెమింగ్‌


Question 13

ప్రపంచంలో అతిపెద్ద మహా సముద్రం ఏది ?

Answer : పసిఫిక్‌ మహా సముద్రం
Question 14
భూమి ఉపగ్రహమైన ‘‘చంద్రుని’’పై నడిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ?
Answer : నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌
Question 15
సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నింటిలో ‘ఎర్రని గ్రహం’ అని దేనిని పిలుస్తారు ?
Answer : మార్స్‌
May 12, 2026

GK Questions and Answers Pdf -.11

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf - 10

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf - 09

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf - 08

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf - 07

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf . 06

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf . 05

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf - 04

PDF Document

May 12, 2026

GK Questions and Answers Pdf - 03

PDF Document

May 12, 2026

బీసీ గురుకుల డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

జ్యోతిబా ఫులే గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 16 వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగించామని సొసైటీ కార్యదర్శి సైదులు పేర్కొన్నారు.
May 12, 2026

GK Questions and Answers Pdf . 02

PDF Document

May 11, 2026

ఇండియన్ జాగ్రఫీ

PDF Document

May 11, 2026

రేపటి నుంచే ఇంటర్ అడ్మిషన్స్ 2026-27 ప్రారంభం - షెడ్యూల్ విడుదల!

📅 దరఖాస్తుల ప్రారంభం: మే 12, 2026
⏳ చివరి తేదీ: మే 31, 2026
🎓 జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

✅ మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు
❌ ఎలాంటి అడ్మిషన్ టెస్టులు లేవు
📌 GPA ఆధారంగా సీట్ల కేటాయింపు
📄 ఆధార్ తప్పనిసరి...

📚 MPC, BiPC, MEC, CEC, HEC & Vocational కోర్సులకు అడ్మిషన్స్.
May 11, 2026

9వ తరగతి నుంచే సెమిస్టర్‌ విధానం!

పదోతరగతి, ఇంటర్‌కు కూడా వర్తింపు

🔷ఏడాదిలో రెండు సార్లు పరీక్షలతో ఒత్తిడి తగ్గుతుందన్న భావన

🔶‘తెలంగాణ విద్యా విధానం’ కమిటీ కసరత్తు

🍥తొమ్మిదో తరగతిలో ప్రారంభించి పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌ వరకు సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..? సగం సిలబస్‌తో పరీక్షలైనందున విద్యార్థులపై కొంత వరకు ఒత్తిడి తగ్గుతుంది.. ఈ దిశగా తెలంగాణ విద్యా విధానం(టెప్‌) కమిటీ సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త విధానాన్ని పట్టాలెక్కించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాఠశాల విద్యతోపాటు ఇంటర్‌ వరకు వార్షిక విద్యా విధానమే అమల్లో ఉంది.

🌀ఉన్నత విద్య మాదిరిగానే..: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యలో ఏ కోర్సులోనైనా సెమిస్టర్‌ విధానం అమలవుతోంది. పరీక్షలు కూడా సెమిస్టర్‌ వారీగా నిర్వహిస్తారు. సిలబస్‌ వేర్వేరుగా ఉంటుంది. వార్షికమైతే ఎప్పుడో మార్చి/ఏప్రిల్‌లలో కదా పరీక్షలు.. అప్పటికి ఏదో ఒకటి చదువుకుందాం అనే భావనలో ఎక్కువ మంది విద్యార్థులుంటారు. మరికొందరు ప్రారంభం నుంచే చదువుపై దృష్టి సారించినా సిలబస్‌ మొత్తాన్ని పరీక్షల సమయంలో పునశ్చరణ చేసుకొని.. గుర్తుపెట్టుకొని రాయడం సమస్యగా భావిస్తారు. అదే సెమిస్టర్‌ విధానం వల్ల విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే దృష్టి సారిస్తారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అధికారుల అభిప్రాయాన్నీ స్వీకరించగా... తాము సానుకూలమేనని వారు చెప్పినట్లు సమాచారం. ‘సెమిస్టర్‌ విధానం వల్ల టీచర్లు సైతం హడావిడిగా సిలబస్‌ పూర్తి చేయకుండా.. ప్రణాళికబద్ధంగా ఉంటారు. తొలి సెమిస్టర్‌లో సాధించిన మార్కుల్ని బట్టి విద్యార్థులపై ఒక అంచనాకు వస్తారు. ఒకవేళ తక్కువ మార్కులు వస్తే.. రెండో సెమిస్టర్‌ కోసం మరింత శ్రద్ధ పెట్టొచ్చు’ అని కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారు. తొమ్మిదో తరగతి నుంచి వీలుకాకుంటే తొలుత ఇంటర్‌కైనా సెమిస్టర్‌ విధానం అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

💥అనుభవపూర్వక అభ్యసన విధానానికి పెద్దపీట

💠జ్ఞాపకశక్తి ఆధారంగా థియరీ ఎక్కువగా చదవడాన్ని తగ్గించి.. అనుభవపూర్వకంగా నేర్చుకునే(ఎక్స్‌పీరియన్స్‌డ్‌ లెర్నింగ్‌) విధంగా.. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేసే దిశగా తెలంగాణ విద్యా విధానాన్ని సంకలనం చేస్తున్నారు. అందుకు పూర్తిస్థాయిలో ల్యాబ్‌లను నిర్మించడం అత్యంత ముఖ్యమని కమిటీ భావిస్తోంది. పాఠశాల విద్యలో ఇంటర్‌మీడియట్‌ను విలీనం చేయడం కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమని భావిస్తున్నారు.
May 10, 2026

8 నుంచి ఇంటర్ అడ్మిషన్లు

✅జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

✅జూన్ 30తో తొలివిడత ప్రవేశాలు ముగింపు

✅అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు

📌అడ్మిషన్ షెడ్యూల్:

✳️*అడ్మిషన్స్ ప్రారంభం (మొదటి విడత) : మే 8*

✳️*దరఖాస్తులకు చివరి తేదీ : మే 31*

✳️*తరగతులు ప్రారంభం: జూన్ 1*

✳️*మొదటి విడత అడ్మిషన్ల ముగింపు: జూన్ 30*

🎯రాష్ట్రంలో రెండేళ్ల ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభినవ్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, వెల్ఫేర్, మైనారిటీ, కేజీబీవీ, మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల అడ్మిషన్లు ఈ షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. మే 8 నుంచి తొలివిడత అడ్మిషన్లు ప్రారంభం కానుండగా, జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్లను ముందుగానే సిద్ధం చేసుకుని, నిర్ణీత గడువులోపు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని బోర్డు సూచించింది. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అడ్మిషన్ తీసుకోవడం మంచిదని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.

ప్రవేశాల నిబంధనలు ఇలా..

ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు పొందవచ్చు. అయితే, ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికెట్, టీసీ సమర్పించిన తర్వాతే అడ్మిషన్ ఖరారు ఆవుతుంది. ప్రవేశాలు కేవలం విద్యార్థి సాధించిన జీపీఏ, సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే జరగాలి. ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పని సరిగా ఆధార్ సంఖ్యను సమర్పించాలి. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా 'యాంటీ-డ్రగ్ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రవేశాల్లో రిజర్వేషన్లు పాటించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం సీట్లు కేటాయించారు. ప్రత్యేక కళాశాలలు లేని చోట బాలికల కోసం 33.33 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

యాజమాన్యాలకు సూచనలు

ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదని, అనుమతించిన సీట్ల వివరాలను ప్రతిరోజూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని బోర్డు స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థులు చేరినట్లయితే 24 గంటల్లోగా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలి. విద్యార్థులు కేవలం బోర్డు గుర్తించిన అఫిలియేటెడ్ కళాశాలల్లోనే చేరాలని, ఆ జాబితా బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని సూచించారు. అనుమతించిన సెక్షన్లలోనే అడ్మిషన్లు చేపట్టాలి. ఒక్కో సెక్షన్లో గరిష్టంగా 88 మంది విద్యార్థులకే అనుమతి. నిలిపివేసిన కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్ట రాదు. అదనపు సెక్షన్లు ప్రారంభించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. నిబంధనలు, ఉల్లంఘిస్తే జరిమానాలు, అనుబంధ గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
May 05, 2026

RGUKT IIIT Admissions 2026-27: Selection Process, Seats, Bonus Marks పూర్తి వివరాలు

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
▪️ బోనస్ మార్కులు ఎన్ని ఇస్తారు?
▪️Tie అయితే ఎంపిక ఎలా చేస్తారు
▪️ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఎంపిక ప్రాసెస్
▪️ మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి
▪️ రీజినల్ వారీగా ఎన్ని సీట్లు ఉన్నాయి

పూర్తి వివరాలు....

https://jobresultlive.com/1518/aprgukt-iiit-admissions-2026-27-selection-process-seats-bonus-marks
➖➖➖➖➖➖➖➖➖
పూర్తి వివరాలు వీడియో రూపంలో....

https://youtu.be/ljuG3IakLU8?si=OZnXqGrYuS3_TXwG
May 05, 2026

ANGRAU పాలిటెక్నిక్ అడ్మిషన్స్ 2026-27 నోటిఫికేషన్ విడుదల

Acharya N. G. Ranga Agricultural University నుండి డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

అర్హత: SSC / సమానమైన పరీక్ష ఉత్తీర్ణులు

కోర్సులు:

▪️Diploma in Agriculture
▪️Diploma in Seed Technology
▪️Diploma in Organic Agriculture
▪️Diploma in Agricultural Engineering

▪️ దరఖాస్తులు ప్రారంభం:05.05.26

పూర్తి నోటిఫికేషన్ క్రింది వెబ్ పేజీ నందు కలదు....

https://jobresultlive.com/1531/angrau-polytechnic-admissions-2026-27-notification
May 05, 2026

తెలుగు’లో తడబాటు *మాతృభాషలోనే ఎక్కువమంది ఫెయిల్* *ఆసక్తి కలిగిస్తున్న టెన్త్ ఫలితాలు

ఈసారి పదో తరగతి ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మాతృభాష తెలుగులో ఎక్కువమంది విద్యార్థులు తడబడటం, పరాయి భాషలు హిందీ, ఇంగ్లిష్‌ల్లో మాత్రం ఉత్తీర్ణతాశాతం ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్న పరిణామం. సబ్జెక్టుల్లో సైన్సు అత్యధిక విద్యార్థులకు సవాల్‌గా మారింది. ఎక్కువమంది ఈ సబ్జెక్టులో ఫెయిల్ కావడమో లేక తక్కువ మార్కులు స్కోర్ చేయడమో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు 6,17,827 మంది రాయగా, 5,26,677 మంది ఉత్తీర్ణులయ్యారు. 91,150 మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో మాతృభాష తెలుగులోనే ఎక్కువమంది డమ్మీ కొట్టారు.

దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ పట్ల సాధారణంగా శ్రద్ధ తక్కువ. ఇంగ్లిషు అంటే మన విద్యార్థులు క్లిష్టంగా భావిస్తారు. అయితే ఈ రెండింటిలోనూ తక్కువ మందే ఫెయిల్ కావడం గమనార్హం. సైన్స్‌లో 54,272 మంది (59.5 శాతం), సోషల్ 38,066(41.80), మ్యాథ్స్ 39,722(43.60) మంది ఫెయిల్ అయ్యారు. ఇక ఇంగ్లిష్‌లో 8,771 మంది(9.6 శాతం), హిందీ 1,436 (1.6 శాతం) మంది ఉత్తీర్ణులు కాలేదు. తెలుగులో అత్యధికంగా 37,679(41.3 శాతం) మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో బాలికల కంటే బాలురే ఎక్కువగా ఉన్నారు. 82.68 శాతం మంది బాలురు పాస్ కాగా, బాలికలు 87.9 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక.. 573 మందికి (0.6శాతం) అన్ని సబ్జెక్టులూ పోయాయి. 3,514 మంది(3.9 శాతం) ఐదు సబ్జెక్టులు, 8,268 మంది (9.1శాతం) నాలుగు సబ్జెక్టులు, 12,938 మంది(14.2 శాతం) మూడు సబ్జెక్టులు, 21,195 మంది (23.3 శాతం) రెండు సబ్జెక్టులు, 44,662 మంది (49 శాతం) ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యారు.
May 05, 2026

పాలిటెక్నిక్ అడ్మిషన్స్ 2026-27

ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం (ANGRAU) ద్వారా డిప్లొమా కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం...

అర్హత: SSC (10వ తరగతి) ఉత్తీర్ణులు.

అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సులు:

డిప్లొమా ఇన్ అగ్రికల్చర్

డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ

డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్

డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్

డిప్లొమా ఇన్ లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్

డిప్లొమా ఇన్ హార్టికల్చర్

అప్లికేషన్ ప్రారంభం: 05-05-2026

చివరి తేదీ: 21-05-2026


అధికారిక వెబ్‌సైట్:
www.angrau.ac.in
May 05, 2026

NEST ప్రవేశ పరీక్ష 2026 పూర్తి వివరాలు

1. NEST అంటే ఏమిటి?
NEST = National Entrance Screening Test. ఇది రెండు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో 5 ఏళ్ల Integrated MSc ప్రోగ్రామ్‌లో చేరడానికి తప్పనిసరి పరీక్ష.
1. NISER, Bhubaneswar – National Institute of Science Education and Research – 202 సీట్లు
2. UM-DAE CEBS, Mumbai – University of Mumbai – Dept. of Atomic Energy Centre for Excellence in Basic Sciences – 59 సీట్లు
కోర్సులు: Physics, Chemistry, Biology, Mathematics

2. నోటిఫికేషన్ & ముఖ్యమైన తేదీలు 2026
ఈవెంట్ తేదీ 2026
దరఖాస్తు ప్రారంభం జనవరి 5
దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 8, రాత్రి 11:30
దరఖాస్తు కరెక్షన్ ఏప్రిల్ 17-18
అడ్మిట్ కార్డ్ మే 15 నుండి
పరీక్ష తేదీ జూన్ 6, మధ్యాహ్నం 2-5
ఫలితాలు జూన్ 24
కౌన్సెలింగ్ జూలై 2026

3. అర్హతలు
- విద్యార్హత: 2025 లేదా 2026లో 12th/Intermediate పాస్ అయి ఉండాలి
- సబ్జెక్టులు: 11th, 12thలో Physics, Chemistry, Math, Biology లో కనీసం 3 సబ్జెక్టులు చదివి ఉండాలి
- మార్కులు: General/OBC: 60%, SC/ST/PwD: 55%
- వయోపరిమితి: లేదు
- ఫీజు: Male Gen/OBC: ₹1400, Female/SC/ST/PwD: ₹700

4. పరీక్ష సరళి
- మోడ్: Computer Based Test, ఆన్‌లైన్
- వ్యవధి: 3 గంటలు, 2 PM - 5 PM
- సెక్షన్లు: 4 – Physics, Chemistry, Math, Biology. ఒక్కో సెక్షన్‌లో 20 ప్రశ్నలు
- మొత్తం మార్కులు: 240. ఒక్కో సెక్షన్ 60 మార్కులు
- మార్కింగ్: సరైన సమాధానం +3, తప్పు సమాధానం -1
- మెరిట్: 4 సెక్షన్లలో మీరు అన్ని రాసినా, బెస్ట్ 3 సెక్షన్ల మార్కులే లెక్కిస్తారు

5. ఇది చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుంది?
1. ఉచిత విద్య + స్టైఫండ్: సెలెక్ట్ అయిన వారికి ఉచిత విద్యతో పాటు నెలకు ₹5,000 స్టైఫండ్ ఇస్తారు
2. ప్రాజెక్ట్ గ్రాంట్: వేసవి ప్రాజెక్ట్ కోసం ఏడాదికి అదనంగా ₹20,000 కాంటింజెన్సీ గ్రాంట్
3. రిసెర్చ్ కెరీర్: NISER & CEBS రెండూ Dept. of Atomic Energy కింద నడుస్తాయి. PhD, రిసెర్చ్ సైంటిస్ట్, ISRO, BARC, DRDO, IISC, TIFR లాంటి సంస్థల్లో అవకాశాలు ఎక్కువ
4. అకాడెమియా: IIT, IISER లలో ప్రొఫెసర్, రిసెర్చ్ గైడ్‌గా వెళ్లవచ్చు.
5. ఇతర ఎగ్జామ్స్: JAM, GATE, CSIR-NET లకు బలమైన పునాది అవుతుంది.

మొత్తం సీట్లు కేవలం 261 మాత్రమే. కాబట్టి పోటీ చాలా ఎక్కువ.

6. ఈజీగా పాస్ అవ్వడం ఎలా?

NEST = JEE Main లెవెల్ + Biology. కాన్సెప్ట్ క్లియర్ ఉంటే ఈజీ.

3-నెలల స్ట్రాటజీ:

1. సిలబస్ పట్టుకోండి: 11th, 12th NCERT ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ పూర్తిగా చాలు
2. బెస్ట్ 3 ఫార్ములా: మీకు బలంగా ఉన్న 3 సబ్జెక్టులు ఎంచుకోండి. 4వ సబ్జెక్ట్ బ్యాకప్‌గా ఉంచండి. మెరిట్‌లో బెస్ట్ 3 మాత్రమే తీసుకుంటారు
3. గత 10 ఇయర్స్ పేపర్లు: ఇదే కీ. ప్రశ్నల సరళి అర్థమవుతుంది
4. మాక్ టెస్టులు: ఏప్రిల్ 14 నుండి మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. రోజూ ఒకటి రాసి, నెగటివ్ మార్కింగ్ వల్ల తెలియని ప్రశ్నలు గెస్ చేయొద్దు
5. టైమ్ మేనేజ్‌మెంట్: 180 నిమిషాల్లో 60 ప్రశ్నలు = ఒక్కో ప్రశ్నకు 3 నిమి. మొదట ఈజీ ప్రశ్నలు, తర్వాత కష్టమైనవి.
6. బయాలజీ ట్రిక్: మ్యాథ్స్, ఫిజిక్స్ వీక్ అనుకునే వాళ్ళు బయాలజీ + కెమిస్ట్రీ + మ్యాథ్స్/ఫిజిక్స్ ఒకటి స్ట్రాంగ్ చేసుకుంటే చాలు.

ముఖ్య చిట్కాలు:
- NCERT లైన్ టు లైన్ చదవండి, ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ.
- ఫిజిక్స్, మ్యాథ్స్‌లో న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయండి.
- అడ్మిట్ కార్డ్ మే 15 నుండి డౌన్‌లోడ్ చేసుకోండి

మీరు సైన్స్ రిసెర్చ్‌లో కెరీర్ కోరుకుంటే, NEST బెస్ట్ ఆప్షన్. సీట్లు తక్కువ కాబట్టి ఇప్పటి నుంచే NCERT + Previous Papers పై ఫోకస్ పెట్టండి
May 05, 2026

MJPBCW (మహాత్మా జ్యోతి భాపులే రెసిడెన్సిల్ ) లో డిగ్రీ ప్రవేశ (TGMJPDC CET) -2026-27.

👉 అర్హత :ఇంటర్ 2nd ఇయర్ కంప్లీట్ అయినా విద్యార్థులు

👉 కావాల్సినవి:ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ , ఆధార్ కార్డు, ఫోటో, సంతకం, మెయిల్ id.

👉 లాస్ట్ తేది :10-05-2026.

👉 ఎగ్జామ్స్ లేదు, ఇంటర్ లో వచ్చిన మర్క్స్ & క్యాస్ట్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
May 03, 2026

జూన్ నాటికి బుక్స్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు
ప్రతి సబ్జెక్టుకు ఒక నోట్ బుక్ పంపిణీ
ఇప్పటికే జిల్లాలకు 1.09 కోట్ల పుస్తకాలు
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయానికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందుబా టులో ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 2026-27 విద్యా సంవత్సరానికి విద్యాశాఖ పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పార్ట్-1 పుస్తకాలు 81 శాతం వరకు జిల్లాలకు చేరాయి. మొత్తం 1,35,70,155 పుస్తకాల అవసరం ఉండగా, ఇప్పటివరకు 1,10,26,229 (1.10 కోట్ల) పుస్తకాలను వివిధ జిల్లాల పాయింట్లకు చేరవేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పుస్త కాలను మే 10 నాటికి సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు పుస్తకాలన్నీ అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొంటు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు ఉండగా, పాఠ్యపుస్తకాలనుజిల్లా డిపోల నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్పీలకు తరలి స్తారు. మే చివరి వారం, జూన్ మొదటివారంలోగా స్కూళ్లకు పంపిస్తారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచితంగా నోట్ బుక్స్ సైతం అందిస్తోంది. ప్రతి సబ్జెక్టుకు ఒక్క నోట్ బుక్ చొప్పున అన్ని సబ్జెక్టులకు అందిస్తు న్నారు. ఈ నోట్ పుస్తకాలను కార్గో ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా స్కూళ్లకు పంపిస్తున్నారు.

💥జిల్లాల వారీగా పాఠ్యపుస్తకాలు

🌀పుస్తకాల పంపిణీలో జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారా బాద్ జిల్లాలు 90 శాతంతో అగ్రస్థానంలో నిలిచాయి. అదేవి ధంగా నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాలు 89 శాతం పంపిణీతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వెనకబడిన జిల్లాలకు సంబంధించి యాదాద్రి జిల్లాకు సంబంధించి పంపిణీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు 66 శాతంతో వెనుకబడి ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్లో 85 శాతం, రంగారెడ్డిలో 83 శాతం మేడ్చల్ లో 82శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయింది.
May 02, 2026

రేపటితో టీజీ టెట్ అప్లికేషన్స్ ఎడిట్ ఆప్షన్ క్లోజ్

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) -జూన్ 2026కు సంబంధించి మొత్తం 1,36,418 దరఖాస్తులు వచ్చినట్లు టీజీ టెట్ కన్వీనర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగిసింది. ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. ఎడిట్ ఆప్షన్ రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికా రులు సూచించారు. ఈసారి టెట్ పేపర్-1కు 32,779 మంది, పేపర్-2కు 86,305 మంది, రెండు పేపర్లకు కలిపి 17,334 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,36,418 దరఖాస్తుల్లో 28,149 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు. ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అనే నిబంధన ఉన్న నేపథ్యంలో వీరు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల డౌన్లోడ్ సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ను సంప్ర దించాలని అధికారులు సూచిస్తున్నారు.
May 02, 2026

లక్ష వరకు తగ్గిన టెట్‌ దరఖాస్తులు

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు ఈసారి ఏకంగా లక్ష మంది అభ్యర్థులు తగ్గనున్నారు. గురువారం అర్ధరాత్రి తొలివిడత టెట్‌ దరఖాస్తు గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు వరకు పేపర్‌-1, 2లకు కలిపి మొత్తం 1,27,582 మందే అప్లై చేసుకున్నారు. అందులో పేపర్‌-1కు 30,539 మంది, పేపర్‌-2కు 80,682, రెండూ రాసేవారు మరో 16,361 మంది ఉన్నారు. జనవరి టెట్‌కు 2,37,754 మంది దరఖాస్తు చేశారు. దాంతో పోల్చుకుంటే ఈసారి లక్ష మంది వరకు అభ్యర్థులు తగ్గనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తున్నారు. దాంతో అనేక మంది అర్హత సాధిస్తున్నారు. అయినా డీఎస్‌సీలో టెట్‌కు 20% వెయిటేజీ ఉన్నందున మార్కులు పెంచుకునేందుకు నిరుద్యోగ అభ్యర్థులు పోటీపడుతుంటారు. అయితే ఏడాదిలో రెండేసిసార్లు రాయడం.. దానికితోడు రెండేళ్ల నుంచి డీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకోవడం లేదు.
May 01, 2026

ppp

PDF Document

Apr 28, 2026