Admin Login
Language:

Baal Aadhaar : పిల్లల ఆధార్ నమోదుకు కొత్త రూల్స్.. పేరెంట్స్ బయోమెట్రిక్ తప్పనిసరి

May 17, 2026 Ambati Net World
[ Responsive Header Ad Slot ]
Baal Aadhaar : పిల్లల ఆధార్ నమోదుకు కొత్త రూల్స్.. పేరెంట్స్ బయోమెట్రిక్ తప్పనిసరి

ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డీ జారీకి రెండు కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఉడాయ్ (UIDAI). పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవాలంటే సమర్పించాల్సిన డాక్యుమెంట్లు, బయోమెట్రిక్ ప్రామాణీకరణపై ఈ నిబంధనలు అమలు చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

🌀UIDAI ప్రకారం.. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార కార్డులను ఇకపై వారి పేరెంట్స్ ఆధార్ కార్డుల ఆధారంగా జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ ధృవీకరణ కూడా తప్పనిసరి చేశారు. పిల్లల ఆధార్ కార్డుజారీ సమయంలో తల్లిదండ్రులలో ఒకరి నుంచి ఫింగర్ ప్రింట్స్ గానీ, ఐరీష్ గానీ తీసుకుంటారు. కొత్త నిబంధనల కింద, ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు పొందడం అనేది ఇకపై పూర్తిగా కుటుంబ పెద్ద (HoF) బాధ్యత అవుతుంది. పిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి..దానికి బయోమెట్రిక్ ప్రామాణీకరణ,ధృవీకరణ ఉండాలి.

💠పిల్లల పుట్టిన తేదీ ,కుటుంబంతో వారి సంబంధానికి సంబంధించిన ఫ్రూఫ్ కూడా అందించాలి. చిన్న పిల్లలకు వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్‌లు తీసుకోలేరు కాబట్టి వారి తల్లిదండ్రులలో ఒకరి ద్వారా బయోమెట్రిక్ ప్రామాణీకరణ తప్పనిసరి చేసింది ఉడాయ్.

🥏ఇక రెండో నిబంధన విషయానికొస్తే..శిశు సంరక్షణ సంస్థ (CCI)లో నివసిస్తున్న పిల్లలకు ఆధార్ కార్డు జారీకి జిల్లా బాలల సంరక్షణ అధికారి జారీ చేసిన సర్టిఫికేట్‌ను ధృవీకరణ డాక్యుమెంట్ గా పరిగణిస్తారు.

[ Bottom Related Article Ad Slot ]