నైపుణ్యం కలిగిన బీసీ మహిళలు స్వయం ఉపాధి పొందేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,000 మంది లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.
ఈ పథకం అమలు తీరుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు తదితరులు పాల్గొని పథకం విధివిధానాలపై చర్చించారు.