మే 1 నుంచి ఖాతాల్లో జమ...!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో రైతులకు ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రెండో విడతలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ముందుగా ఇచ్చిన హామీ మేరకు కౌలు మొత్తాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఇందుకోసం మే1 ను ముహుర్తంగా నిర్ణయించింది. ఈ మేరకు వారి ఖాతాల్లో మే1న నగదు జమ చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.