2026లో 10వ తరగతిలో 90% మార్కులు సాధించిన వారు (దివ్యాంగులైతే 75%) వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యాదాన్ స్కాలర్షిప్-2026కు దరఖాస్తు చేసుకోవాలని సరోజిని దామోదరన్ ఫౌండేషన్ తెలిపింది. జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎంపికైన వారికి ఇంటర్ లేదా డిప్లొమా చదువు నిమిత్తం సంవత్సరానికి రూ.10 వేల వరకు మంజూరవుతాయని తెలిపింది. అనంతరం విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువు కోసం ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.75 వేల వరకు పొందుతారని పేర్కొంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.vidyadhan.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు